విద్యార్థులు ఇచ్చిన విరాళాన్ని సీఎంకు అందించిన మంత్రి సంధ్యారాణి
విజయవాడ వరద బాదితుల కోసం పాచి పెంట మండలం పాంచాలి ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థులు 7 వేలు రూపాయల విరాళం ఇచ్చారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బుధవారం అందించాను అని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ విరాళం చాల విలువైనది… పసిపిల్లలు విశాలహృదయంతో ఇచ్చారని చెప్పాను. పిల్లలు ఇచ్చిన విరాళం స్వీకరించిన ముఖ్యమంత్రివర్యులు విద్యార్థులను అభినందించారు. చిన్నవయసులో పెద్దమనసుతో బాధితులను ఆదుకునేందుకు చేసిన ఈ సాయం ఎంతో గొప్పది అన్నారు. పిల్లలకు ప్రత్యేక అభినందనలు చంద్రబాబు తెలిపారు.