గ్రీవెన్స్ లో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సర్పంచులు
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కి మండల సర్పంచులు వినతి ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత సంక్షేమ పథకాలు పంపిణీ, అభివృద్ధి పనులు మంజూరు, సర్పంచ్ ల ప్రమేయం లేకుండా, ఎటువంటి తీర్మాణాలు చేయకుండానే చేపడుతున్నారని సర్పంచ్ లు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచ్ అధికారాలను తుంగలో తొక్కుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. వినతి పత్ర సమర్పణలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మాజీ వైస్ ఎంపీపీ సువాడ రామకృష్ణ, పలు పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.