పార్వతీపురం ఐటీడీఎలో అక్టోబర్ 2న పీఎం జుగా ప్రారంభం

అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవంతం చేయండి

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా ) కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీఎం జుగా మరియు పీఎం జ‌న్ మ‌న్‌ (ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) కార్యక్రమాల కొనసాగింపు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి అక్టోబర్ 2వ తేదీన జార్ఖండ్ లోని హజారీబాగ్ లో పిఎమ్ జుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం దేశంలోని 140 కి పైగా జిల్లాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని ఆయన తెలియజేశారు. ఆ రోజు పార్వతీపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఐటిడిఎ ప్రాంగణంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కార్డులు నమోదు, పీఎం ఉజ్వల్ ఉచిత గ్యాస్, ఆధార్ కార్డుల నమోదు, జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి కుళాయిలు, పివిటిజి గ్రామాలలో రహదారులు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే స్టాల్స్ లను అన్ని సంబంధిత విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి, భారత ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. సమావేశంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యం నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు,జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి రవి, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్. మన్మథ రావు, జిల్లా విద్యా శాఖ అధికారి జి. పగడాలమ్మ, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *