నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, జేసీ, అధికారులు
మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్. శోభిక, జిల్లా రెవిన్యూ అధికారి జి.కేశవనాయుడు, సహాయ బి.సి.సంక్షేమ అధికారి ఇ.అప్పన్న తదితరులు వాల్మీకి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.