గిరిజన గ్రామాలను సందర్శించిన కలెక్టర్
ప్రతి శుక్రవారం గ్రామదర్శిని
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
గ్రామాల్లోని సమస్యలు పరిష్కారానికి ప్రతీ శుక్రవారం గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి పి.కొనవలస గిరిజన సంక్షేమ బాలుర గురుకుల వసతి గృహంలో పల్లె నిద్ర చేసిన కలెక్టర్ శుక్రవారం ఉదయం సాలూరు మండలంలోని కురుకుట్టి గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో మమేకమై ఏమైనా సమస్యలను ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల నిర్వహణ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసారు. జీడిపిక్కల ప్రోసీసింగ్ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దర్శిని కార్యక్రమం క్రింద ప్రత్యేక అధికారులు గ్రామాల్లో సందర్శించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతంలో రక్త హీనత కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నందున ప్రత్యేక శ్రద్ధ తో పౌష్టికాహారం అందివ్వడం, నెల నెలా రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన ఆరోగ్య తనిఖీలు, గ్రామాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు పక్కగా జరిగే విధంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాఠశాల, అంగన్వాడి కేంద్రాల్లో బడి తోట నిర్వహణకు ప్రోత్సాహం, గ్రామ పంచాయితీల నిధులతో బాల విహార్ క్రింద పిల్లల ఆట విడుపుకోసం మైదానం ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సురక్షితమైన తాగునీరు అందేలా, వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించేలా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా తోడ్పాటును అందించాలని తెలిపారు.
*సికిల్ సెల్ ఎనిమియా విద్యార్థినికి మెరుగైన వైద్యం*
ఇంటర్మీడియట్ చదువుతున్న హేమలత సికిల్ సెల్ ఎనిమియా తో బాధపడుతున్నందున కలెక్టర్ దగ్గరుండి రక్త పరీక్షలు నిర్వహించాలని ఏ ఎన్ ఎం లకు ఆదేశించారు. బాలికకు రక్త హీనత ఉన్నట్లు తేలడంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందాలని అవసరమైతే రక్త మార్పిడి చేయాలని వైద్యులు అజయ్ కు సూచించారు. రక్త హీనత కేసులు ఎక్కువగా ఉంటున్నందున రక్త నిల్వలు పెంచేందుకు రక్త దాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు ముందస్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆశావర్కర్లు ను సూచించారు. ఏ ఒక్క గర్భిణీ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు తన దృష్టికి వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రోగులకు టీబీనీ క్షయ మిత్ర ద్వారా మందులు పంపిణీ చేసి సక్రమంగా మందులు వాడుతున్నది లేనిది ఏ ఎన్ ఎమ్ లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాథమిక దశలోనే చికిత్స అందించాలని, లేని పక్షంలో ఎక్కువ మందులు వాడాల్సి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురౌతారని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేక రేషన్ , పింఛను పొందేందుకు కష్టతరం అవుతుందని కలెక్టర్ దృష్టికి గ్రామస్థులు తీసుకురాగా జిల్లాలో 70 సెల్ టవర్లకు గానూ
బీస్ ఎన్ ఎల్ 27 , జియో 11 టవర్లు నిర్మాణం కావాల్సి ఉందనీ త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
అక్కడ నుంచి వెలగ వలస గ్రామాన్ని సందర్శించి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నవి, లేనిది పరిశీలించారు. జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పా రావు, తాసిల్దారు రమణ, ఎమ్ పి డి ఓ జి.పార్వతీ, ఏ పి ఎమ్ సింహాచలం, ఐసిడిఎస్ పిఓ విజయ లక్ష్మి, గ్రామ సచివాలయం సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.