పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
రెండో భార్య దగ్గరకు వెళ్లొద్దు అన్నందుకు మొదటి భార్యను హతమార్చాడు ఓ ప్రబుధ్దుడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరాసవలస గ్రామంలో ఈనెల 20వ తేదీన కరాసమ్మ అనే మహిళ హత్యకు గురైంది. హత్య కేసు కు సంబంధించిన వివరాలను సాలూరు గ్రామీణ సీఐ రామకృష్ణ వెల్లడించిన వివరాలివీ… కరాసవలస గ్రామానికి చెందిన బి శ్రీను కరాసమ్మను 15 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే 12 ఏళ్లు కిందట రాము అనే మహిళను శ్రీను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల కిందట రెండో భార్య కూడా కరాసవలస వచ్చింది. అక్కడే కాపురం ఉంటుంది. విషయం తెలుసుకున్న మొదటి భార్య కరాసమ్మ రెండో భార్య రాము దగ్గరకు వెళ్ళవద్దని భర్తతో గొడవ పడింది. గత నెల 29న పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కరాసమ్మ గొంతుకు చీరచుట్టి శ్రీను చంపేశాడు. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీ లో ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్ కి వచ్చి శ్రీను లొంగిపోయాడు. భార్యను హతమార్చిన కేసులో అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సిఐ , ఎస్ ఐ నరిసింహ మూర్తి తెలిపారు.