బంగారు, వెండి చీరలతో అమ్మవార్లకు అలంకరణ
కామాక్షి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి వెండి చీరతో అలంకరించారు. అలాగే ఏకామ్రనాథ సమేత కామాక్షి అమ్మవారి కి అత్యంత వైభవంగా కళ్యాణం పూజలు నిర్వహించారు. అర్చకులు సూరిబాబు ఆధ్వర్యంలో దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణం జరిపారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి బంగారు చీరతో అలంకరించి, విజయదశమి పూజలు చేశారు. అర్చకులు హేమంత్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి మహిళా సంఘం, యువజన సంఘం, ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.