మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి జరిగిన జెంటిల్ మెన్ ఒప్పందం అమలు చేయని కారణంగా తనకు అన్యాయం జరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జరాజాపు దీప్తి తెలిపారు.
ఆమె తో పాటు పార్టీ, పదవులకు, రాజీనామా చేసినట్లు జరజాపు సోదరులు మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షుడు సూరిబాబు తెలియజేసారు.
రాజీనామా లేఖలను వైకాపా జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ పంపించామన్నారు.
వీరితో పాటు మరో నలుగురు కౌన్సిలర్లు పార్టీ కి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాాచారం.