దసరా పండుగ సందర్భంగా ఆదివారం కక్క..ముక్క..చేపలకు భలే గిరాకీ వచ్చింది. చిన్న పెద్ద.. పేద.. ధనిక అనే తేడా లేకుండా చికెన్, మటన్, చేపలు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. కిలో మటన్ వెయ్యి రూపాయలు కాగా, చికెన్ కిలో 200 నుంచి 250 రూపాయలు, ఫిష్ కేజీ ధర 150 నుంచి 250 రూపాయల వరకు పలికింది. కోటవీధి, పెద్ద మార్కెట్, ఆర్టీసి కాంప్లెక్స్ దగ్గర, దండిగాం రోడ్డులో మాంసం విక్రయ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. కిలోకి 100 నుంచి 150 ఎక్కువ ధరకు అమ్మినా కొనుగోలుకు ఎవరూ వెనుకాడలేదు. ధరలు పెంచి తూనికల్లో కూడా మోసం జరగుతున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు కొనుగోలు చేశారు.