పాచిపెంట మండలం ఎర్రొడ్ల వలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు జన్ని లేఖన, హెచ్. అఖిల్, మరో వ్యక్తి చింత ప్రసాద్ శనివారం కుక్క కాటుకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురికి పాచిపెంట పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం 108 వాహనంలో సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాచిపెంట మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో వందల సంఖ్యలో కుక్కలు పశువులు మేకలు గొర్రెలు ప్రజలను కరుస్తున్నాయని సిపిఎం నాయకులు కోరాడ. శ్వరరావు తెలిపారు. కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.