ఆకట్టుకున్న చిన్నారుల కోలాటం
సాలూరు పట్టణ ప్రధాన రహదారిలో విజయదుర్గ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొలువు తీర్చిన దుర్గమ్మకు నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి పూజలు ముగించి ఆదివారం రాత్రి నవదుర్గలకు నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి వాహనాలపై నవదుర్గ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. చిన్నారుల కోలాటం, మోటార్ కార్మికులను నృత్యాలు, సంగీత వాయిద్యాల నడుమ తిరువీధి సాగింది. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన వందలాదిమంది భక్తులు నిమజ్జనోత్సవం పాల్గొన్నారు. పట్టణ పోలీసులు ప్రత్యేక బలగాలు బందోబస్తుతో ఊరేగింపు వేగావతి నదీ తీరం వరకు సాగించారు.