పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. దుర్గమ్మ శైలపుత్రిగా భక్తులకు తొలి రోజున దర్శనమిచ్చారు. కామాక్షి అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది సుహాసినిలు చండీ హోమం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో హోమం కుంకుమ పూజలు అమ్మవారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.