ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం స్వీకరణ
సీబీఐ విచారణతో నిజం నిగ్గు తేల్చాలి
🔸మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర డిమాండ్
🔸చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు.
🔸రాజ్యాంగ పదవులలో ఉంటూ మతపరమైన వాఖ్యలు సరికావని అన్నారు.
🔸 ఎన్నో సార్లు తిరుమలకి వెళ్లిన జగన్ కి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు..? అని ప్రశ్నించారు.
🔸 సీఎం, డిప్యూటీ సీఎం కూర్చో అంటే కూర్చునే సిట్ తో విచారణ వద్దన్నారు. సీబీఐ లేదా సుప్రీం తో విచారణ జరపాలని భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా అన్నారు.
🔸 లడ్డూ కల్తీ ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్ఠ దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ వి. అప్పలనాయుడు, జేసీఎస్ కన్వీనర్ గిరి రఘు, ముత్యాలు నాయుడు, దండి శ్రీను, వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.