సాలూరు పట్టణ ప్రధాన రహదారి పక్కన విజయదుర్గ మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవదుర్గలను మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర దర్శించుకున్నారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కటాక్షం సాలూరు నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు పట్టణ వైసిపి అధ్యక్షులు వి. అప్పలనాయుడు, గిరి రఘు, పి. రామకృష్ణ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.