ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామం తులసి కళ్యాణ మండపంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జరజాపు మోహన్ రావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు బిగ్ టీవీ యాజమాన్యం జెమ్స్ ఆసుపత్రి వైద్యులు ముందుకు రావడం అభినందించాల్సిన విషయం అన్నారు.  శిబిరంలో శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ వైద్య బృందం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి 200 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జనరల్ డాక్టర్ తో పాటు స్త్రీలు, గుండె, చెవి, ముక్కు, కంటి వైద్య నిపుణులు వైష్ణవి డి కిరణ్ రెడ్డి కే శ్రావణి ఇమాన్యుయేల్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. టిడిపి నాయకులు కరిబుగత భాస్కరరావు రోగులకు మందులు అందజేశారు.  బిగ్ టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శివశంకర్, కెమెరామెన్ హరీష్ బొబ్బిలి, సాలూరు రిపోర్టర్లు రాజేష్, గుప్తేశ్వరరావు, జెమ్స్ పీఅర్వో శ్రీరామ్, ఏరియా మేనేజర్ ఎ. అబ్రహం,  అసిస్టెంట్ మేనేజర్ ఎం. సింహాచలం, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ,వైద్య శిబిరంలో రోగులకు సేవలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *