శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఉచిత ఇసుక, వైద్యం, ఇరిగేషన్, పంచాయతీరాజ్ వంటి కీలక అంశాలపై కలెక్టర్, సీఈవో, ఛైర్ పర్సన్, ఇతర నాయకులు చర్చ జరిపారు.
ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీ విధానం ద్వారా పేద ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ విధానం నిర్మాణరంగంలో పని చేస్తున్న పేదలకు మరియు ఇళ్ల నిర్మాణం చేపడుతున్న చిన్నస్థాయి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి తెచ్చి వారి ఆర్థిక భారం తగ్గించిందని ఎంపీ ప్రశంసించారు.
ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను తెలియజేయడం వాటి పరిష్కారాలను సూచించారు. జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరుకోవడానికి కృషి చేయాలని ప్రోత్సహించారు.