పార్వతీపురం మన్యం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు.
రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో ఎన్నికలు పటిష్టంగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజక వర్గాలలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 36 స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, 16 వీడియో సర్వేలియన్స్ బృందాలు, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందాల పనితీరు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించడం జరుగుతోందని ఆయన తెలియజేశారు.
ప్రజలు సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబరుతో సహా సి విజిల్, ఆన్ లైన్ పిర్యాదుల విభాగంలో సైతం అందించవచ్చు అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ తనిఖీలు ముమ్మరం చేయాలని, ఎన్నికల ప్రలోభాలకు సంబంధించి ఎటువంటి రవాణా జరుగుతున్నా, కార్యకలాపాలు సాగుతున్న నిర్ణీత సమయంలో తనిఖీలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సి విజిల్ పిర్యాదులు పరిష్కారంలో మరింత వేగాన్ని పెంచాలని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద వెబ్ కాస్టింగ్ విధిగా చేయాలని ఆయన ఆదేశించారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉండాలని, మద్యం, గంజాయి, ఇతర సామగ్రి రవాణాకు అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రచారాలకు రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పాలకొండ శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కల్పనా కుమారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, ఇన్ ఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు పార్వతీపురం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు కురుపాం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి వి వెంకట రమణ, ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, నోడల్ అధికారులు – జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ ఇమంది మురళి
తదితరులు పాల్గొన్నారు.