ప్రభుత్వ కార్యాలయంలో వినియోగించాల్సిన ఫర్నిచర్ ఆరు నెలలుగా ఓ అధికారి ఇంట్లో ఉందన్న విషయం ఈరోజు బయట పడింది. దీనిపై పలు విమర్శలు రావడంతో పుర అధ్యక్షురాలు ఈశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాత కమిషనర్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను కార్యాలయానికి రప్పించాలని ఆదేశించారు ఈ మేరకు కమిషనర్ రాఘవాచార్యులు ఫర్నిచర్ ను వెంటనే తీసుకురావాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాత కమిషనర్ ప్రసన్నవాణి అద్దె ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాక్టర్ లో తీసుకువచ్చి కార్యాలయంలో అప్పగించారు. అప్పగించిన వాటిలో ఏసీ, ఫ్యాన్లు, కుర్చీలు, టేబుల్లు, వీధి దీపాలు కూడా వుండటం విశేషం దీంతో ఫర్నిచర్ ఏమైందో, ఎక్కడ ఉందో అని ఇన్నాళ్లు తెలియని వారంతా ఓహా.. పాత కమిషనర్ ఇంట్లోనే ప్రభుత్వ కార్యాలయ ఫర్నిచర్ ఉందా అని నోరేళ్లబేట్టారు.i