మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర
గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు
గాంధీ పేరుతో ఉన్న ఉపాధి చట్టాన్ని గౌరవించరు గ్రామ స్వరాజ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాల వ్యవస్థను, వాలంటీరు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. మహాత్మ మన్నించు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్దిని ప్రసాదించు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పి రాజన్న దొర అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పట్నంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం తోనే రామరాజ్యం వస్తుందని గాంధీజీ అన్నారు కానీ ఈ ప్రభుత్వం లో పాలకులకు మాత్రమే స్వాతంత్రం వచ్చిందన్నారు. మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారన్నారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడేందుకు మళ్లీ మీరు జన్మించాలని గాంధీజీని కోరారు. కార్యక్రమంలో వైకాపా నేతలు వి అప్పలనాయుడు గిరి రఘు, గొర్రె జగన్, రామకృష్ణ, సర్పంచ్ ఆదియ్య, తదితరులు పాల్గొన్నారు.