జి సి డి ఓ కలీషా బేగం
గాజువాక: వృత్తి విద్యను అభ్యసించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి డాక్టర్ కలిషా బేగం అన్నారు. శుక్రవారం గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిల ఇంటర్నషిప్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పరెల్ మేడ్ అప్ కోర్సుకు సంబంధించి 13 మంది విద్యార్థినిలకు రేణుక, శ్రావణి బోటేక్ లలో విద్యార్థినిలుకు జిసిడివో కలీషా బేగం వృత్తి విద్య . దాని గొప్పతనం గురించి వివరించారు. ఎల్ఎన్ జె స్కిల్ సంస్థ కోఆర్డినేటర్ మెట్ట సుధాకర్ భట్లు ఇంటర్న్ షిప్ లో పిల్లలకి వృత్తి విద్య పట్ల అవగాహన కల్పించినారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.