పాచిపెంటలో కుక్కల దాడిలో మూడు సంవత్సరాల చిన్నారి బుధవారం గాయపడింది.
దాసరి వీధికి చెందిన కే.హంసిని ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేసాయి.
బాలిక అరుపులు విని స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికకు పాచిపెంట ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సాలూరు సీహెచ్సీకి తరలించారు.