పార్వతిపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణం శ్రీనివాస్ నగర్ కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది వేడుకలలో భాగంగా స్వామి వారికి అభిషేకాలు, కళ్యాణం, పూజలు నిర్వహిస్తున్నారు.
ఆలయ ధర్మకర్త వంగపండు రాజేంద్రప్రసాద్ తొలి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణచార్యులు ఆధ్వర్యంలో అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పట్టణం పరిసర ప్రాంత భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.