ఆలయ కమిటీ సభ్యులకు అందజేసిన భక్తులు కోట నాగరాజు గవరరాజు
పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతీ దేవి అలంకరణకు భక్తులు కోట నాగరాజు గవరరాజు లక్ష 30 వేల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు(శతమానాలు) ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బంగారు నగలు అందజేసిన దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.