సుపరిపాలన చంద్రన్నకే సాధ్యం

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ…
100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే మెచ్చుకుంటున్నారన్నారు.

సైకో పాలనలో గత ఐదేళ్లు కష్టాలు, కన్నీళ్లే.

సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కనుకే సైకో పాలన సమాధి చేశారన్నారు. మంచి ప్రభుత్వం కావాలని, మంచి రోజులు రావాలని సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబును మళ్లీ నాలుగోసారి ముఖ్యమంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూడా అభివృద్ధి చేస్తూ మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందుకే, ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల్లోనే ప్రజలే మెచ్చుకునేలా చంద్రబాబు సుపరివపాలన అందించారని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
కోట్లాదిమంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సైకో ప్రభుత్వం అపవిత్రం చేసిందన్నారు. అందుకే కోట్లాదిమంది ప్రజలు వైకాపా నేతలను ఛీ కొడుతున్నారన్నారు. నా కుమారుడు పుట్టినరోజు వేడుకలు విజయవాడలో నా ఇంట్లో చేసుకున్నాం. తిరుపతి కొండపై పద్మావతి గెస్ట్ హౌస్ లో చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు రాశారన్నారు. వెంకన్న స్వామిని అపహాస్యం చేసిన వైకాపా నేతలు, ఆపార్టీ పత్రికతో పాటు, తప్పుడు రాతలు రాసినోళ్లు సర్వ నాశనం అయిపోతారన్నారు.

కార్యక్రమంలో పాంచాలి సర్పంచ్ యుగంధర్, ఎంపిటిసి ఉమా, మండల టిడిపి అధ్యక్షుడు పి. ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ముఖి సూర్యనారాయణ, కె. సురేష్, ప్రత్యేక అధికారిని ప్రసూన, డిప్యూటీ డిఈఓ రాజకుమార్, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *