అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడే పాలన

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం:

సభలో ప్రసంగిస్తున్న మంత్రి సంధ్యారాణి

గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రజా వేదిక నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన 1670 కోట్లు రూపాయలు ధాన్యం బకాయిలు ,అలాగే నీరు, చెట్టు  బకాయిలు 276 కోట్లు నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సమర్థవంతమైన నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఐదు సంతకాలతో రాష్ట్ర దిశా దశను మార్చేశారన్నారు. పేదల కడుపు నింపేందుకు 175 నియోజకవర్గాలలో 100 అన్న క్యాంటీన్ లను ఒకేసారి ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 400 రేషన్ డిపోలు ఏర్పాటు కానున్నాయన్నారు. కొత్తగా డీఎస్సీ తో 16,437 ఫీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు.  మూడుసార్లు సీఎంగా 9 డీఎస్సీలు నిర్వహించి 2,32 179 టీచర్ పోస్టులు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు దే అన్నారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చంద్రబాబు మంజూరు చేయించారు అన్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు చేసి ప్రజలకు గుంతల నుంచి మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు అలాగే గిరిజన ప్రాంతా అభివృద్ధికి ఐటిడిఏ లకు 173 కోట్లు నిధులు తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఐదు కోట్ల రూపాయలతో చంద్రన్న బాటలు వేస్తున్నామన్నారు. 13,350 గ్రామపంచాయతీలో ఒకేసారి సమావేశాలు నిర్వహించి, 4050 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం అన్నారు‌.  పంచాయతీల్లో తీర్మానించిన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అంగన్ వాడీల అభివృద్ధి కి కేంద్రం రూ. 70 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ‌గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలం  కేటాయిస్తుందన్నారు. ఇళ్లు కట్టుకోడానికి రూ. 4లక్షల రూపాయలు మంజూరు చేస్తాం అన్నారు.

ఈ కార్యక్రమం లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, డీఎఫ్ వో ప్రసూన, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, టిడిపి నేతలు పరమేశు, అన్నపూర్ణ, రమాదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *