మహిళల భద్రత పై రాసిన కవిత ఉత్తమంగా ఎంపిక
తెలంగాణ రాష్టానికి చెందిన ఉమెన్ సేఫ్టీ, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా మహిళల భద్రత అనే అంశం పై ఆన్లైన్ లో నిర్వహించిన వచన కవితల పోటీల్లో పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, శ్రీ వెంకట విద్యాగిరి కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు రచించిన ఎందుకు ఊరుకోవాలి అనే కవితను ఉత్తమ కవిత గా ఎంపిక చేసారు. అనకాపల్లి గౌరీ గ్రంధాలయం లో శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షులు కత్తిమండ. ప్రతాప్, జాతీయ కార్యదర్శి కొల్లి రమాదేవి, ఒడిస్సా రాష్ట్ర అధ్యక్షులు బొమ్మాడి నరసింగరావులు డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో వివిధ సంస్థల ప్రతినిధులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సన్మాన గ్రహీత కోడూరు మాట్లాడుతూ అందరికి సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండాలని, గుర్తించి సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.