స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాలూరు లో జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
పార్వతీపురం విజయనగరం ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కార్యక్రమం సోమవారం సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ .. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పిల్లలను ప్రతిరోజు ఆట ఆడుకునేందుకు తల్లిదండ్రులు పంపించాలని మంత్రి కోరారు. శారీరక ధారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం క్రీడలతోనే సాధ్యమన్నారు. జిల్లాస్థాయి పోటీ లలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మురళి, నియోజకవర్గ ఇన్చార్జి చక్రవర్తి ,ఆనంద్ , పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎన్. చిట్టి, పీడీలు రవి, దుర్గాదేవి, నిర్మల కుమారి, పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు.