వరద బాధితులకు చిరంజీవి విరాళం

చిరు, రామ్ చరణ్ తరపున రూ.కోటి చెక్కు సీఎం చంద్రబాబుకి అందజేత

ముఖ్యమంత్రి చంద్రబాబును  ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి  కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షలు విరాళం అందించారు. వరద బాధితులు, ప్రభుత్వం తరపున సీఎం చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.  విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సీఎం సాదర స్వాగతం పలికారు.  భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి చంద్రబాబు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *