విద్యుత్ ఘాతానికి‌ ఇళ్లు దగ్ధం

కాలిబూడిదైన రూ.3.50 లక్షల డబ్బు, ఆరు తులాల బంగారం

విద్యార్థుల ధ్రువపత్రాలు అగ్నికి ఆహుతి

విధ్యుత్ ఘాతకానికి పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నగదుతోపాటు, బంగారం, బీటెక్ చదువుతున్న పిల్లల సర్టిఫికెట్లుతో సహా కాలి బూడిదయ్యాయి. బాధితులు అందించిన వివరాల మేరకు..  మక్కువ మజ్జి వీధికి చెందిన కొవ్వాడ వెంకటరావు కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం  ఇంటికి తాళాలు వేసి పొలం పనులకు వెళ్ళారు. సుమారు11 గంటల సమయంలో ఇంట్లో విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. అగ్ని మంటలకు ఫ్రిడ్జ్ కంప్రసర్ వేడెక్కి పేలి పోయింది. దీంతో, పెంకిటింట్లో  మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాధంలో బీరువాలో దాచిపెట్టిన రూ 3 లక్షల యాభై వేలు నగదుతోపాటు ఆరు తులాల బంగారం కాలి బూడిదయ్యాయి. అంతేకాకుండా ఇంటిలోగల గృహాపకరణాలు, బట్టలుతోపాటు బీటెక్ చదువుతున్న ఇద్దరు పిల్లల ధ్రువ పత్రాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. సర్వం కోల్పోయి బాధిత కుటుంబం రోడ్డున పడింది. అగ్ని  ప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు అగ్నిమాపక శకటంతోపాటు వచ్చి మంటలు అదుపులోకి‌ తీసుకు వచ్చారు.  అప్పటికే  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరికి బాధితులు కట్టు బట్టలే  మిగిలాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పి మల్లేశ్వరరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అగ్ని ప్రమాదం లో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *