కేసు నమోదు చేసిన కొత్త వలస పోలీసులు
అరకు నుంచి ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్నారని వచ్చిన సమాచారం కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు మాటువేసి వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. సూట్ కేసులో 9కేజీల 700గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తవలస సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ దాడిలో కొత్తవలస తహసిల్దార్ నీలకంఠ రావు, వీఆర్వో రామానుజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.