సాలూరు, మే 8 : సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ను సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్ బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి మంచినీరు, అల్పాహారం, భోజనం, పంపిణీ కౌంటర్లు పక్కాగా ఉండాలని ఆయన చెప్పారు. ఎటువంటి సందేహాలకు తావులేకుండా బోర్డులను ఏర్పాటు చేయాలని, ఎవరు ఎక్కడ సామగ్రి పొందాలో వివరంగా ఉండాలని ఆయన అన్నారు. పోలింగ్ కు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను పరిశీలించారు. హోమ్ ఓటింగ్ బ్యాలెట్ లను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.