జిల్లా వృత్తి విద్యాధికారిణి మంజుల వీణ
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మొదటి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజులను నవంబరు 11వ తేదీలోపు చెల్లించాలని పార్వతీపురం మన్యం జిల్లా వృత్తి విద్యాధికారిణి డి.మంజులవీణ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరము ,రెండవ సంవత్సరం థియరీ పరీక్షల ఫీజు 600 రూపాయలు గాను, జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్స్ కు అదనంగా 275 రూపాయలు, బ్రిడ్జ్ కోర్స్ రాయాలనుకున్న విద్యార్థులు అదనంగా 165 రూపాయలు, మొదటి ,రెండవ సంవత్సరం (రెండు సంవత్సరాల బ్యాక్లాగ్ పేపర్లు) పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు 1200 రూపాయలు,, మొదటి ,రెండవ సంవత్సరం (రెండు సంవత్సరాలు కలిపి)ఒకేషనల్ ప్రాక్టికల్స్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు 550 రూపాయలు చెల్లించాలని ఆమె తెలిపారు. హాజరు మినహాయింపు (ప్రైవేటు) విద్యార్థిని విద్యార్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించడానికి ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. 1000 అపరాధ రుసుముతో నవంబర్ 20వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఆమె తెలిపారు.