నియోజకవర్గంలో పశుగణన సక్రమంగా జరగాలని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో పశుగణన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుగణన సక్రమంగా జరిగితే పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉందన్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడే రైతుల వార్షికాదాయాన్ని పెంచేదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి సన్యాసి అప్పలనాయుడు, మంచాల వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.