ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యే లు
ఈనెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి తొల్లేళ్ళు, సినిమానోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. విజయవాడలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవ ఆహ్వాన పత్రిక అందించారు. పైడితల్లి ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్య మంత్రిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు కోరారు.