పనితీరుపై అసంతృప్తే కారణం..
గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు రుక్మాంగదయ్యను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. డిడి పనితీరు పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను సక్రమంగా నిర్వహించలేక పోవడం, తనిఖీలు చేయడం లేదని, సిఆర్టీల క్రమబద్ధీకరణలో డబ్బులు వసూలు చేసారనే ఆరోపణలు గతంలో రావడం. వంటి కారణాలతో సరెండర్ చేసినట్లు తెలిసింది.