ఇది మంచి ప్రభుత్వంపై విస్తృత ప్రచారం: చిట్టి

ఇంటింటికి వెళ్లి స్టిక్కర్  అంటించి కరపత్రాలు అందిస్తున్న టిడిపి నేతలు

కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టణ టిడిపి నేతలు జోరుగా సాగిస్తున్నారు.  టౌన్ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది చిట్టి,  వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారు.  అలాగే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు.  వంద రోజుల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టింది, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెల్పుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్టి మాట్లాడుతూ..  అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ఉపాధి శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ తో టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయన్నారు. ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ మరోవైపు ప్రతిపక్ష నేతల కుట్రలు కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

28వ వార్డులో మాజీ కౌన్సిలర్ శోభారాణి ప్రచారం
11వ వార్డు చిన్న వీధిలో  ప్రచారం చేస్తున్న బాల
12వ వార్డులో కేతిరెడ్డి చంద్రశేఖర్, సచివాలయ ఉద్యోగులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *