సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త: రిషి వర్ధన్
మన మతాన్ని ప్రేమిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం అని జనసేన పార్టీ సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన గత వైసిపి పాలనకు నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు దీపారాధన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. మీ పట్టణాల్లో మండలాల్లో గ్రామాలలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో లేదా రామ మందిరంలో లేదా మీ సమీప ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులని ఆహ్వానించి దీపారాధన కార్యక్రమం చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గ్రామ పట్టణ నాయకులు అందరూ కూడా పాల్గొవాలని కోరారు. కార్యక్రమం ఫోటోలు, వీడియోలు మీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలియచేస్తూ వ్యక్తిగతంగా తనకి పంపించాలని తెలిపారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని నలు దిశలా చాటి చెప్పాలని కోరుకుంటున్నా అన్నారు.