గాంధీ జయంతి సందర్భంగా సాలూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నేతలు జరజాపు ఈశ్వరరావు, సూరిబాబు, రాపాక మాధవరావు, జిటి నాయుడు, కౌన్సిలర్ పప్పల లక్ష్మణ, సింహాచలం పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్ముడు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పిల్లా మురళి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.