పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ వైకాపా నేత జరజాపు సూరిబాబు జన్మదిన వేడుకలు శనివారం స్థానిక సీతారామ ధర్మశాల లో ఘనంగా నిర్వహించారు. సూరిబాబు కేకు కట్ చేయగా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ఆయనకు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అతని పుట్టినరోజు వేడుకల్లో లైన్స్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు, వ్యాపార సంఘ నాయకులు, లారీ ఓనర్ల సంఘం అధ్యక్షులు, మాజీ వైస్ చైర్మన్ గిరి రఘు, వైకాపా కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు సూరిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.