పేదలకు వస్త్రాలు పంపిణీ
అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సూర సాంబయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం
సాలూరు పట్టణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదు రుగా ఉన్న నవజీవన్ నిరాశ్రిత చిన్నారుల ఆశ్రమంలో విశ్వకవి గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరు. సాంబయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు పద్మభూషణ్ గుర్రం జాషువా లాంటి మహానుభావుల జయంతి వేడుకలు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఇదేవిధంగా బొబ్బిలి,మెట్టవలసలో జాషువా జయంతి వేడుకలు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పేద మహిళ లకు చీరలు, తువ్వాలు పంపిణీ చేశారు. హాస్టల్లో చిన్నారులకు స్వీట్లు, కేకు ఆయన పంచిపెట్టారు. హాస్టల్ మేనేజర్ చిక్కాల. చి న్నమ్మలు ( శాంతి), ఐఆర్డీఎస్ అధ్యక్షురాలు చిక్కాల. స్వాతిశ్రీ,, మాల మహానాడు అధ్యక్షులు ఎండ.గోపాలరా వు తదితరులు పాల్గొన్నారు.