టిడిపిలో 40 కుటుంబాలు చేరిక
కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో మెంటాడ మండలం పెడచామలాపల్లి పంచాయితీ నుండి మండల పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకటరావు ఆధ్వర్యంలో గ్రామ నాయకుల సమక్షంలో రాయి బంగార్రాజు, దివకాల రాంబాబు తదితరులు 40 కుటుంబాలు తెదేపా లో చేరారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నచ్చి సంధ్యారాణి పనితీరుపై, నమ్మకంతో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
సంధ్యారాణి పార్టీ లో చేరిన వారికి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, గెద్ద అన్నవరం, ఈశ్వరరావు, గౌరీశ్వరారావు, ముసలినాయుడు, డబ్బి కృష్ణ, పెడ్డచామలపల్లి నాయకులు పాల్గొన్నారు.