తెదేపా లో చేరికలు

కూటమితోనే రాష్ట్రాభిృద్ధి : గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా

కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పాచిపెంట మండలంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

బాబు సూపర్ సిక్స్ పథకాలను అందరికీ వివరించారు.

గుమ్మిడి సంధ్యారాణి గొట్టూరు  పంచాయతీ దిగువ గొట్టూరు , మెట్టగుడ్డి గ్రామాలలో మాజీ వార్డు మెంబర్లు మాదల బుద్ధయ్య, చదల సోములు, మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు అధ్యక్షతన,  సూకురు అప్పలస్వామి ఆధ్వర్యంలో  60  కుటుంబాలు  వైసీపీ నుండి టీడీపీ లో చేరారు. సంధ్యారాణి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. గిరిజన గ్రామాల్లో గ్రామస్తులు గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సౌకర్యం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మాకు రోడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారని,
ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సంధ్యారాణి మా సమస్యలు తీరుస్తారని నమ్మి టీడీపీలో చేరినట్లు గ్రామస్తులు తెలియజేశారు.

సంధ్యారాణి మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ సమస్యలన్ని తీర్చుతామని మీకు అవసరమైన రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముఖి సూర్యనారాయణ, గుడేపు యుగంధర్, కొత్తల పోలినాయుడు, గోర్లే సత్యం, కనకబాబు, దోనేరు ఆనంద్, పంట్ల భాస్కర్ ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *