పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు రెండో రోజు సోమవారం వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు విష్ణు సహస్ర పారాయణం చేశారు. పూజా కార్యక్రమాల్లో పట్టణం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.