సుహాసినిలు కుంకుమార్చన పూజలు
సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు.
అమ్మవారికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. వందలాది మంది సుహాసినిలు అమ్మవారిని దర్శించుకుని, కుంకుమార్చన పూజలు చేశారు. దేవీ ఉపాసకులు ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి, ఏకామ్రనాథ స్వామికి, మహాగణపతికి అభిషేక పూజలు జరిగాయి. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి కామాక్షమ్మకి పూజలు నిర్వహించారు.