సరస్వతి దేవిగా కామాక్షి అమ్మవారు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సరస్వతి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవి ఉపాసకులు ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో కామాక్షమ్మకు ప్రత్యేక పూజలు, చండీమాతకి కుంకుమార్చన, చండీ హోమం భక్తులు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.