చింతూరులో గీత రోడ్ షో కు అనూహ్య స్పందన లభించింది.
అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత శుక్రవారం చింతూరులో రోడ్ షో నిర్వహించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆమె తొలుత ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషతో కలిసి అనంతరం గీత మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని, తద్వారా ఏపీ అభివృద్ధికి అంతా తోడ్పాటునందించాలని కోరారు.
రోడ్ షో లో ప్రచార రథం ముందు ఉమ్మడి అభ్యర్థుల కార్యకర్తలు, అభిమానులు ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అందర్నీ హుషారెత్తించారు.
గీతమ్మ, శిరీషమ్మను గెలిపించాలంటూ కార్యకర్తలు, అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రోడ్డు పొడవునా ప్రజలు వారికి మద్దతుగా నడిచారు.
ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.