మరో 110 కుటుంబాల సభ్యులు
పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి
విజయనగరం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ పంచాయతీ సర్పంచ్ భీమారావుతో పాటు మరో 110 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలంటే టిడిపి తోనే సాధ్యమని తెదేపాలో చేరుతున్నట్లు సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.