పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి రాజుల వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగించి, బుధవారం నిమజ్జనోత్సవం భక్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రదాన వీధులలో కోలాటం, బల్ల వేషాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. గ్రామ ప్రజలు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.