1400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసిన గ్రామీణ పోలీసులు
సాలూరు మండలం సారిక- నేరెళ్లవలస గ్రామాల మధ్య నాటు సారా తయారీ కేంద్రంపై సాలూరు గ్రామీణ ఎస్సై నరసింహమూర్తి సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 లీటర్ల సారాతో డిప్పల చిన్నయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు అలాగే ఏడు డ్రమ్ములలో నిల్వచేసిన 1400 లీటర్ల బెల్లం ఊటలను పోలీసులు ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ తెలిపారు. దాడులలో ఎస్ఐతోపాటు శివశంకర్, గోపి, రాంబాబు, సురేష్ పాల్గొన్నారు.