సాలూరు పట్టణం పెద కోమటిపేట రామాలయం లో గురువారం లలితా దేవికి మణిద్వీప వర్ణన పూజ భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా మాతృమండలి సభ్యులచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి ప్రసాద నివేదన హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వినయ్ శర్మ, శ్యామ్ ఆచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వందలాది మంది భక్తులు అమ్మవారికి పూజలు చేశారు.